26-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''
మధురమైన పిల్లలారా - మీరు ముత్యాలను గ్రోలేె హంసలు, మీది హంసల సమూహము,
మీరు భాగ్యశాలీ నక్షత్రాలు(లక్కీ సితారే) ఎందుకంటే స్వయం జ్ఞాన సూర్యుడైన
తండ్రి మిమ్ములను సన్ముఖంగా చదివిస్తున్నారు ''
ప్రశ్న:- తండ్రి పిల్లలందరికీ ఏ ప్రకాశమునిచ్చినందున పురుషార్థము తీవ్రమైపోయింది?
జవాబు:- పిల్లలూ!
ఇది డ్రామాలోని అంతిమ సమయము. మీరు నూతన ప్రపంచములోకి వెళ్ళాలి. ఏది
లభించాలని ఉందో, అదే లభిస్తుందిలే అని అనుకోరాదు. మొదట పురుషార్థము చేయాలి.
పవిత్రంగా తయారై ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి. ఇది చాలా గొప్ప సేవ అని
బాబా పిల్లలకు ప్రకాశమునిచ్చారు. ఈ ప్రకాశము లభించిన వెంటనే పిల్లలైన మీ
పురుషార్థము తీవ్రమైపోయింది.
పాట:- నీవు ప్రేమ సాగరుడవు,.......... (తూ ప్యార్ కా సాగర్ హై,...........)
ఓంశాంతి. ప్రేమసాగరుడు,
శాంతి సాగరుడు, ఆనందసాగరుడైన అనంతమైన తండ్రి మా సన్ముఖములో కూర్చొని
శిక్షణ ఇస్తున్నారని పిల్లలకు తెలుసు. జ్ఞానసూర్యుడైన తండ్రే స్వయంగా
ఎవరిని చదివిస్తున్నారో వారు ఎంత భాగ్యశాలి నక్షత్రాలు! ఇంతవరకు కొంగల
మండలిగా ఉండేది, ఇప్పుడు హంస మండలిగా అయిపోయింది. ముత్యాలను
గ్రోలడము(చప్పరించడం) ప్రారంభించారు. సోదరీ-సోదరులైన మీరందరూ హంసలు. ఈ
సమూహాన్ని హంసమండలి అని అంటారు. కల్పక్రితము వారే ఈ సమయములో, ఈ జన్మలో
ఒకరినొకరు గుర్తిస్తారు. ఆత్మిక పారలౌకిక మాతా-పిత, సోదర-సోదరీలు పరస్పరము
ఒకరినొకరు గుర్తిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా మనము పరస్పరము ఇదే
నామ-రూపాలతో కలుసుకున్నామని మీకు గుర్తుందా? ఇలా మీరు ఇప్పుడు మాత్రమే
అనగలరు. తర్వాత ఇంకెప్పుడూ ఏ జన్మలోనూ ఈ విధముగా అనజాలరు.
బ్రహ్మకుమార-కుమారీలుగా ఎవరెవరు అవుతారో వారు మాత్రమే ఒకరినొకరు
గుర్తిస్తారు. ''బాబా మీరు కూడా అప్పటివారే. మీ పిల్లలైన మేము కూడా
అప్పటివారమే. సోదరీ-సోదరులైన మేము మళ్ళీ మా తండ్రి నుండి వారసత్వము
తీసుకుంటాము అని అంటారు. ఇప్పుడు తండ్రి మరియు వారి పిల్లలు ఎదురెదురుగా
కూర్చొని ఉన్నారు. మళ్ళీ ఈ నామ-రూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి. సత్యయుగములో
లక్ష్మీనారాయణులు మేము కల్పక్రితమున్న అదే లక్ష్మీనారాయణులము లేక ప్రజలు
కూడా వీరు కల్పక్రితపు లక్ష్మీనారాయణులే అని అనరు. ఇది కేవలం ఈ సమయములో
పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ సమయములో మీరు చాలా తెలుసుకుంటారు.
ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. నేనే కల్పము యొక్క సంగమ యుగములో వచ్చి
నా పరిచయాన్ని ఇస్తాను. ఈ మాట కేవలం అనంతమైన తండ్రి ఒక్కరు మాత్రమే అనగలరు.
నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము కూడా తప్పకుండా జరగాలి. ఇది
రెండింటి సంగమ యుగము. ఇది చాలా కళ్యాణకారీ యుగము. సత్యయుగాన్ని గానీ,
కలియుగాన్ని గానీ కళ్యాణకారీ అనరు. ఇప్పటి మీ ఈ జీవితము అమూల్యమైనదని మహిమ
చేయబడింది. ఈ జీవితములోనే గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవ్వాలి. పిల్లలైన
మీరు సత్య-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు, ముక్తినిప్పించే ఈశ్వరీయ సైన్యము.
ఈశ్వరుడు వచ్చి మిమ్ములను మాయ నుండి ముక్తము చేస్తారు. మీకు ఇది కూడా
తెలుసు - ముఖ్యంగా మిమ్ములను జనరల్‌గా ప్రపంచమంతటిని మాయ సంకెళ్ళ నుండి
విడిపిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. ఇప్పుడు
గొప్పతనము(మహిమను) ఎవరికివ్వాలి? ఎవరి నటన బాగుంటుందో వారి పేరెే
ప్రఖ్యాతమవుతుంది. అందువలన మహిమ కూడా పరమపిత పరమాత్మకే ఇవ్వబడ్తుంది.
ఇప్పుడు భూమి పై పాపాత్మల భారము చాలా ఎక్కువగా ఉంది. ఆవగింజల వలె
లెక్కలేనంత మంది మనుష్యులున్నారు. తండ్రి వచ్చి భారాన్ని దింపుతారు. అచ్చట
కేవలం కొన్ని లక్షలమంది మాత్రమే ఉంటారు. క్వార్టర్ 25 శాతము కూడా ఉండదు.
అందువలన ఈ డ్రామాను గురించి కూడా బాగా అర్థము చేసుకోవాలి. పరమాత్మను
సర్వశక్తివంతుడని అంటారు. ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో ఉంది. తండ్రి
అంటున్నారు - నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను. యదాయదాహి
ధర్మస్య........ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ భారతదేశములో అప్పటి
ధర్మగ్లానే ఖచ్చితంగా ఉంది. నన్ను కూడా గ్లాని చేస్తారు. దేవతలను కూడా
గ్లాని చేస్తారు. అందుకే చాలా పాపాత్మలుగా అయిపోయారు. వారు ఇలా అయ్యే
తీరాలి. సతో, రజో, తమోలోకి వచ్చే తీరాలి. మీరు ఈ డ్రామాను అర్థము
చేసుకున్నారు. బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞాన
ప్రకాశమునిచ్చారు. ఇప్పుడు ఈ డ్రామా అంతిమ సమయములో ఉంది. ఇప్పుడు మీరు
మళ్ళీ నూతన ప్రపంచము కొరకు పురుషార్థము చేయండి. అంతేకాని ఏది లభించాలని
ఉంటే, అది లభిస్తుంది అని అనుకోరాదు. పురుషార్థము ఫస్ట్, మొత్తం శక్తి
అంతా పవిత్రతలోనే ఉంది. ఇది పవిత్రత య్కొ బలిహారమే. దేవతలు పవిత్రులు
ఉంటారు. అందుకే అపవిత్ర మనుష్యులు వారి ముందుకు వెళ్ళి తల వంచుతారు.
సన్యాసులకు కూడా తల వంచి నమస్కరిస్తారు. మరణించిన తర్వాత వారి
స్మృతిచిహ్నాలు తయారుచేస్తారు. ఎందుకంటే వారు పవిత్రులుగా అయ్యారు.
కొంతమంది భౌతిక సంబంధమైన మంచి పనులు(సేవలు) కూడా ఎన్నో చేస్తారు.
ఆసుపత్రులు తెరుస్తారు లేక కాలేజీలు తెరుస్తారు. అటువంటివారి పేరు కూడా
ప్రసిద్ధమౌతుంది. అందరినీ ఎవరు పవిత్రము చేస్తారో, మరియు వారికి ఎవరైతే
సహాయపడ్తారో, వారికి అందరికంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సదా
పవిత్రంగా ఎవరు ఉంటారో (బాబా), వారితో యోగము చేసి మీరు పవిత్రంగా అవుతారు.
మీరు వారితో ఎంతగా యోగము జోడిస్తూ ఉంటారో, మీరు అంత పవిత్రంగా అవుతారు.
తర్వాత అంతమతి సో గతి అవుతారు. అనగా తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. వారు
యాత్రలకు వెళ్ళినప్పుడు తండ్రి వద్దకు వెళ్లాలని భావించరు. అయినా పవిత్రంగా
ఉంటారు. ఇచ్చట అయితే తండ్రి అందరినీ పవిత్రంగా చేస్తారు. డ్రామాను అర్థము
చేసుకోవడం కూడా ఎంతో సులభము. చాలా పాయింట్లు అర్థము చేయిస్తూ ఉంటారు.
వారంటున్నారు - కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మరణించే
సమయంలో అందరూ భగవంతుని స్మృతిని ఇప్పిస్తారు. అచ్ఛా అయితే భగవంతుడు ఏమి
చేస్తారు? మళ్ళీ ఎవరైనా శరీరాన్ని వదలితే స్వర్గవాసులయ్యారని అంటారు అనగా
పరమాత్ముని స్మృతిలో శరీరము వదిలినందున వైకుంఠములోకి వెళ్ళిపోతారు. వారికి
తండ్రి ఎవరో తెలియదు. అంతేకాక తండ్రిని స్మృతి చేసినందున వైకుంఠానికి
చేరుకుంటామని కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. వారు కేవలం పరమాత్ముని స్మృతి
చేయమని చెప్తారు. ఇంగ్లీషులో వారిని గాడ్‌ఫాదర్ అని అంటారు. ఇచ్చట మీరు
పరమపిత పరమాత్మ అని అంటారు. వారు మొదట గాడ్ అని తర్వాత ఫాదర్ అని అంటారు.
కాని మనము మొదట పరమపిత అని, తర్వాత పరమాత్మ అని అంటాము. వారు సర్వులకు
తండ్రి. ఒకవేళ అందరూ తండ్రులే అయితే ఓ గాడ్‌ఫాదర్(భగవంతుడా)! అని అనజాలరు.
ఈ చిన్న విషయము కూడా అర్థము చేసుకోలేరు. తండ్రి మీకు సులభము చేసి అర్థము
చేయించారు. మనుష్యులు దు:ఖితులుగా అయినప్పుడు పరమాత్మను స్మృతి చేస్తారు.
మనుష్యులు దేహాభిమానులు. కానీ స్మృతి చేసేది దేహమును ధరించిన ఆత్మయే,
పరమాత్మ సర్వవ్యాపి అయితే ఆత్మ పరమాత్మను ఎందుకు స్మృతి చేయాలి? ఆత్మ
నిర్లేపి అయితే మరి ఆత్మను ఏమి స్మృతి చేస్తుంది? ఎవరిని స్మృతి చేస్తుంది?
భక్తిమార్గములో ఆత్మయే పరమాత్మను స్మృతి చేస్తుంది ఎందుకంటే దు:ఖములో
ఉంది. ఎంత సుఖము లభించిందో అంత స్మృతి చేయవలసి ఉంటుంది.
ఇది చదువు. దీని లక్ష్యము కూడా స్పష్టముగా ఉంది. ఇందులో మూఢ నమ్మకాల విషయమేదీ లేదు. మీకు అన్ని ధర్మాలవారు తెలుసు - ఈ సమయములో అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మము వారి చరిత్ర రిపీట్ అవ్వనున్నది. ఇదేమీ కొత్త విషయము కాదు. కల్ప-కల్పము మనము రాజ్యము తీసుకుంటాము. ఎలాగైతే ఆ హద్దులోని సినిమా రిపీట్ అవుతుందో, అలా ఈ బేహద్(అనంతమైన) నాటకము కూడా రిపీట్ అవుతుంది. మన అర్ధకల్పపు శత్రువు ఎవరు? రావణుడు. మనము ఏ యుద్ధమూ చేసి రాజ్యము తీసుకోము. అలాగే హింసాయుతమైన యుద్ధమేదీ చేయుము. విజయము పొందేందుకు మనము ఏ సైన్యాన్ని తీసుకోము, యుద్ధము చేయము. ఇది గెలుపు-ఓటముల ఆట. కాని ఓటమి కూడా సూక్ష్మమైనది. గెలుపు కూడా సూక్ష్మమైనదే. మాయతో ఓడిపోతే అది ఓటమి. మాయతో గెలిస్తే అది గెలుపు. మనుష్యులు మాయకు బదులు మనస్సు అనే పదము వేసేశారు. అందువలన అంతా ఉల్టాగా అయిపోయింది. ఈ డ్రామాలోని ఆట కూడా ముందే రచింపబడి ఉంది. తండ్రి స్వయంగా కూర్చొని పరిచయమిస్తారు. రచయితను గురించి ఏ ఇతర మనుష్యులకూ తెలియనే తెలియదు. కావున వారు తండ్రి పరిచయమును ఎలా ఇస్తారు? రచయిత ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన మనమంతా వారి రచన. అందువలన మనకు తప్పకుండా రాజ్యభాగ్యము లభించాలి. మనుష్యులైతే పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. అప్పుడు అందరూ రచయితలైపోతారు కదా. రచన అనేది లేకుండా చేసేశారు. ఎంత రాతి బుద్ధిగలవారిగా, దు:ఖితులుగా అయిపోయారు! కేవలం మేము వైష్ణవులము అని స్వంత మహిమను చేసుకుంటారు అనగా మేము సగం దేవతలము అని అంటారు. దేవతలు వైష్ణవులుగా ఉండేవారని భావిస్తారు. వాస్తవానికి శాఖాహారానికి ముఖ్యమైన అర్థము అహింసో పరమో ధర్మ:, దేవతలను పక్కా వైష్ణవులని అంటారు. స్వయాన్ని వైష్ణవులని పిలిపించుకునేవారు చాలా మంది ఉన్నారు. కాని లక్ష్మీనారాయణ రాజ్యములో వైష్ణవ సంప్రదాయము వారు పవిత్రముగా కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ వైష్ణవ సాంప్రదాయము వారి రాజ్యము ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరందరూ బి.కె.లు కనుక బ్రహ్మ కూడా తప్పకుండా ఉంటారు. అందుకే ''శివవంశీ ప్రజాపిత బ్రహ్మ సంతానము'' అని పేరు పెట్టారు. శివబాబా వచ్చారని, వారు బ్రాహ్మ సంప్రదాయము రచించారని, ఆ బ్రాహ్మణులే మరలా దేవతలుగా అయ్యారని గాయనము(మహిమ) కూడా చేయబడ్తుంది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. అందుకే మీరు బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలని పిలువబడ్తారు. విరాటరూప చిత్రాన్ని చూపించి తెలిపించడం బాగుంటుంది. విరాట రూపము విష్ణువుదిగా చూపించారు విష్ణువు మరియు అతని రాజధాని(సంతానము) మాత్రమే విరాట చక్రములోకి వస్తారు. ఈ విచారములన్నీ బాబా బుద్ధిలో నడుస్తూ ఉంటాయి. మీరు కూడా విచార సాగర మథనమును అభ్యాసము చేస్తూ ఉంటే రాత్రి పూట నిద్రరాదు. ఈ ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. మీరు కూడా విచార సాగర మథనం చేసే అభ్యాసము చేస్తే రాత్రికి నిదుర రాదు. ఇదే చింత నడుస్తూ ఉంటుంది. ఉదయమే లేచి వృత్తి వ్యాపారాదులలో లగ్నమైపోతారు. ఉదయపు సాయి...... అని అంటారు. మీరు కూడా ఎవరికైనా కూర్చొని అర్థము చేయిస్తే ''ఓ¬! వీరు మమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా, భికారుల నుండి రాకుమారులుగా తయారు చేసేందుకు వచ్చారని అంటారు.'' మొదట అలౌకిక సేవ చేయాలి. స్థూలమైన సేవ ఆ తర్వాత. ఆసక్తి ఉండాలి. ముఖ్యంగా మాతలు చాలా మంచి రీతిగా సేవ చేయవచ్చు. మాతలను ఎవ్వరూ ధిక్కరించరు. కూరగాయలు అమ్మేవారికి, ధాన్యము అమ్మేవారికి, నౌకర్లకు మొదలైన వారందరికీ అర్థము చేయించాలి. చివరిలో మాకు తెలియలేదే అని ఎవ్వరూ ఫిర్యాదు చేయరాదు. సేవ చేయునప్పుడు హృదయములో సత్యత ఉండాలి. తండ్రితో పూర్తి యోగముండాలి. అప్పుడు ధారణ అవుతుంది. సామాగ్రి నింపుకొని తర్వాత ఓడరేవు వద్దకు సామగ్రి డెలివరి చేసేందుకు వెళ్తారు. వారికి ఇంట్లో సుఖముగా ఉండదు. పరుగెడుతూ ఉంటారు. ఈ చిత్రాలు కూడా చాలా సహాయము చేస్తాయి. శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేయుస్తున్నారని ఎంతో స్పష్టంగా తెలుస్తోంది. ఇది రుద్ర జ్ఞానయజ్ఞము. కృష్ణ జ్ఞానయజ్ఞము కాదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైనది. కృష్ణుడు యజ్ఞమును రచింపజాలడు. అతడు 84 జన్మలు తీసుకుంటాడు కావున నామ-రూపాలు మారిపోతాయి. ఇక ఏ ఇతర రూపములోనూ కృష్ణుడు ఉండడు. మళ్ళీ ఎప్పుడైతే అదే రూపములో కృష్ణుడు వస్తాడో అప్పుడే అతని పాత్ర రిపీట్ అవుతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1.
సత్య-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులై లేక ఈశ్వరీయ ముక్తినిచ్చే ఈశ్వరీయ
సైన్యముగా తయారై అందరినీ మాయ నుండి ముక్తులుగా చేయాలి. ఈ జీవతములో గవ్వ
నుండి వజ్ర తుల్యంగా తయారవ్వాలి, ఇతరులను తయారు చేయాలి.
2.
ఎలాగైతే బాబా విచార సాగర మథనము చేస్తారో, అలా జ్ఞాన విచార సాగర మథనము
చేయాలి. కళ్యాణకారులుగా అయ్యి అలౌకిక సేవలో తత్పరులుగా ఉండాలి. సత్యమైన
హృదయముతో సేవ చేయాలి.
వరదానము:- '''నాది' అనే స్మృతి ద్వారా స్నేహము మరియు దయా దృష్టిని ప్రాప్తి చేసుకునే సమర్థ సంపన్న భవ ''
ఎలాగైతే
తండ్రిని గుర్తించి ఒక్కసారైనా హృదయ పూర్వకంగా ' మేరా బాబా ' (నా బాబా, నా
తండ్రి) అని అన్నారంటే, దయా సాగరుడైన బాప్‌దాదా అందుకు బదులుగా అటువంటి
పిల్లలనకు పదమా రెట్లు అదే ఆత్మిక ప్రేమతో చూస్తారు. దయ మరియు స్నేహ పూరిత
దృష్టి వారిని సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇదే ఆత్మిక మేరేపన్ యొక్క
స్మృతి ఇటువంటి పిల్లలకు సమర్థతను నింపుకునే ఆశీర్వాదంగా అయిపోతుంది.
బాప్‌దాదాకు నోటి నుండి ఆశీర్వాదాలిచ్చే అవసరముండదు. కానీ సూక్ష్మమైన స్నేహ
సంకల్పాల ద్వారా ప్రతి పుత్రునికి పాలన జరుగుతూ ఉంటుంది.
స్లోగన్:-''ఎవరైతే తండ్రికి ప్రియమైనవారో, వారికి ఏ ఇతర వ్యక్తి లేక వైభవము పై ప్రేమ ఉండదు''
No comments:
Post a Comment